Top Ad unit 728 × 90

మోడల్‌ ప్రవేశాలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

మోడల్‌ ప్రవేశాలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

మోడల్‌ స్కూళ్లలో 2019-20 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులను ఈ నెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు స్వీకరిస్తారు. 6వ తరగతిలో కొత్త అడ్మిషన్లతో పాటు 7-10 తరగతుల్లో ఖాళీల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ శనివారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. దరఖాస్తును www.telangana.cgg.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లోనే చేయాలన్నారు. ఓసీ విద్యార్థులు రూ.100, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఏప్రిల్‌ 6న ప్రవేశ పరీక్షను 6వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, 7-10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహిస్తారు. ఫలితాలను ఆయా మోడల్‌ స్కూళ్లలో అందుబాటులో ఉంచుతారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా మే 19 నుంచి 26 వరకు తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఎంపికైన విద్యార్థుల తుది జాబితాను మే 27న విడుదల చేస్తారు.

 

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

మోడల్‌ ప్రవేశాలకు 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *