Top Ad unit 728 × 90

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమృతసర్ స్వర్ణ దేవాలయం

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమృతసర్ స్వర్ణ దేవాలయం

గోల్డెన్ టెంపుల్ ను శ్రీ హరమందిర్ సాహిబ్ అని కూడా అంటారు. సంవత్సరం పొడవునా లక్షలాది భక్తులు దీనిని సందర్శిస్తారు. అమ్రిత్సర్ లో కల ఈ ప్రదేశం 16 వ శతాబ్దంలో అయిదవ సిక్కు గురు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. 19 వ శతాబ్దపు మొదటి భాగంలో మహారాజ రంజిత్ సింగ్ గురుద్వారా యొక్క పై అంతస్తులను 400 కే జి ల బంగారుతో పూత వేశారు కనుక దీనిని ఇంగ్లీష్ లో గోల్డెన్ టెంపుల్ అంటారు. రెండు అంతస్తులు కల మార్బుల్ నిర్మాణం గురుద్వారా చుట్టూ అమ్రిత్ సరోవర్ అనబడే కొలను వుంటుంది. పగటి పూట సిక్కుల పవిత్ర గ్రంధమైన ఆదిగ్రంథను ఈ పవిత్రప్రదేశంలో ఉంచుతారు. గోల్డెన్ టెంపుల్ కు నాలుగు ద్వారాలు వుంటాయి. ఇవి మానవ సౌభ్రాతృత్వం మరియు సమానతలు చాటుతాయి. సిక్కులు పవిత్రంగా భావించే ఈ ప్రదేశం జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు తప్పక చూడదగినది.

దేవాలయం క్లుప్త చరిత్ర :

ఇక్కడ కల ఒక పెద్ద సరస్సు ను అమృత్ సరోవర్ అని అంటారు. ఇది ఒక మానవ నిర్మిత సరస్సు. సిక్కుల నాల్గవ గురువు అయిన గురు రాం దాస్ జి ఆధ్వర్యం లో దీనిని నిర్మించారు. ఈ సరస్సు నిర్మాణం సుమారు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఒక దశాబ్దం తర్వాత, 1588 సంవత్సరం లో, సిక్కుల అయిదవ గురువు అర్జున్ దేవ్ జి గోల్డెన్ టెంపుల్ నిర్మాణం చేసారు. గోల్డెన్ టెంపుల్ గురించి చెప్పాలంటే, ఈ టెంపుల్ సిక్కు మతస్తుల పుణ్య క్షేత్రం గా ప్రసిద్ధి చెందినది. అమృత్ సరోవర్ సరస్సులో స్నానం ఆచరిస్తే, చేసిన పాపాలు తొలగిపోతాయని, మోక్షం వస్తుందని ఈ మతస్తులు భావిస్తారు. దేవాలయ శిల్ప శైలి గోల్డెన్ టెంపుల్ అమృత్ సరోవర్ అనబడే పవిత్ర సరస్సు మధ్యలో వుంటుంది. ఈ నిర్మాణాన్ని ఒక ఎత్తైన ప్లాట్ ఫారం పై నిర్మించారు. ఈ ప్లాట్ ఫారం అందంగా పూవులు, లతలతో చెక్కబడి వుంటుంది. టెంపుల్ గోపురం అనేక చిన్న చిన్న గోపురాలు కలిగి వుంటుంది. ఈ గోపురాలు కూడా బంగారు పూతలు వేయబడ్డాయి. ఈ గోపురం దూరానికి కూడా మెరుపులతో మెరుస్తూ కనపడుతుంది. ఇక్కడ టెంపుల్ యాజమాన్యం కుల, మత, లింగ వివక్షత లేకుండా ప్రజలందరినీ తమ టెంపుల్ దర్శనానికి స్వాగతిస్తుంది. వాతావరణం మరియు రవాణా సదుపాయం వేసవి నెలలు అయిన మే నుండి జూన్ వరకు గల నెలలు ఈ టెంపుల్ సందర్శనకు సరైనవి కావు. ఎంతో వేడిగా వుంటుంది. ఇక్కడ వర్ష రుతువు జూలై నుండి ఆగష్టు వరకూ వుంటుంది. వర్షాకాలం తర్వాత ఈ ప్రదేశం ఆహ్లాక్దకరంగా వుండి పర్యటనకు అనుకూలంగా వుంటుంది. అమృత్ సర్ ప్రదేశాన్ని దేశంలోని ప్రధాన ప్రదేశాలనుండి తేలికగా చేరవచ్చు. అమృత్ సర్ కు రోడ్డు, రైలు, వాయు మార్గాలు కలవు. దేశంలోని మెట్రో నగరాలతో చక్కని రవాణా సదుపాయం కలిగి వుంది. ప్రపంచ పర్యాటక ప్రదేశాలలో ఒక ప్రధాన పర్యాటక స్థలంగా పేరు గాంచినది. ఈ ప్రదేశంలో ఒక్క గోల్డెన్ టెంపుల్ మాత్రమే కాక, పర్యాటకులు చూసేందుకు అనేక ఇతర ఆకర్షణలు కూడా కలవు. టెంపుల్ కు సమీపంలో మరికొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు వాగా బోర్డర్. మందిర్ మాతా లాల్ దేవి, శ్రీ ఆకల తఖ్త్, మరియు దుర్గానియా టెంపుల్. పర్యాటకులు వీటిని కూడా చూసి ఆనందించి తమ పర్యటనకు అధిక లాభం చేకూర్చవచ్చు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అమృతసర్ స్వర్ణ దేవాలయం Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *