Top Ad unit 728 × 90

5 ఫిబ్రవరి 2019 మంగళవారం మీ రాశి ఫలాలు

5 ఫిబ్రవరి 2019 మంగళవారం మీ రాశి ఫలాలు...!

మేష రాశి

ఈ రోజు మీ బంధువులను లేదా పరిచయస్థులను కలవటానికి వెళ్తారు. వివాహం లేదా ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. లేదా వాటికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించటం కారణంగా ఇతరుల కోపానికి, అసహనానికి కారకులయ్యే అవకాశముంటుంది. మీ ఉత్సాహాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

వృషభ రాశి

ఈ రోజు వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

మిథున రాశి

ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ లేదా మూత్ర సంబంధ అనారోగ్యం కారణంగా బాధపడతారు.

కర్కాటక రాశి

ఈ రోజు మీ పై అధికారులతో కానీ, సహోద్యోగులతో కానీ, స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంటుంది కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి. శివారాధన మేలు చేస్తుంది

సింహ రాశి

మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.

కన్యా రాశి

ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.

తులా రాశి

ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం కానీ జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు.

వృశ్చిక రాశి

ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. కలుషిత నీరు లేదా ఆహారం కారణంగా అస్వస్థతకు గురయ్యే అవకాశముంది. ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశమున్నది. పట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేయండి.

ధనుస్సు రాశి

ఈ రోజు ఆర్థిక వ్యవహారాల్లో అనుకున్న ప్రగతి సాధిస్తారు. మీరు నిర్వహించే లేదా మీరు పని చేసే సంస్థలు లాభాలు గడిస్తాయి. బ్యాంకు నుంచి మీకు రావలసిన లోన్ లేదా ఆర్థిక సహాయం సమయానికి అందుతుంది. మీ పై అధికారుల మెప్పు పొందటమే కాకుండా ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు.

మకర రాశి

ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

కుంభ రాశి

ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.

మీన రాశి

ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

గమనిక:- వీడియోల కోసం ఈ క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

5 ఫిబ్రవరి 2019 మంగళవారం మీ రాశి ఫలాలు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *