Top Ad unit 728 × 90

పసిడి భారమైనా... చమురు ఆదుకుంది!

పసిడి భారమైనా... చమురు ఆదుకుంది!

ముంబయి: పసిడి దిగుమతి బిల్లు భారం పెరిగినా, ముడిచమురు ధరలు తక్కువగా ఉండటం, ఆర్థిక సేవలపై వచ్చిన అధికాదాయం (ఇన్‌విజిబుల్‌ రిసీట్స్‌) వల్ల జూన్‌ త్రైమాసికంలో కరెంటు ఖాతాలోటు (క్యాడ్‌) జీడీపీలో 2 శాతాని (14.3 బిలియన్‌ డాలర్లు - రూ.1, 00,100 కోట్ల) కి పరిమితమైందని రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో క్యాడ్‌ జీడీపీలో 2.3 శాతం (15.8 బిలియన్‌ డాలర్లు - రూ.1,10,600 కోట్లు) కావడం గమనార్హం. ఈసారి క్యాడ్‌ 30 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గింది. * ఏడాది వ్యవధిలో ఆర్థిక సేవలపై ఆదాయం 29.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,09,300 కోట్ల) నుంచి 31.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2,23,300కోట్ల)కు పెరిగింది.
* పసిడి బిల్లు భారం 8.4 బి.డా. నుంచి 35.6 శాతం అధికమై 11.4 బి.డా.కు చేరింది.
* నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) కూడా 9.6 బి.డా. నుంచి 13.9 బి.డా.కు చేరింది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడి 4.8 బి.డా. కాగా, ఏడాది క్రితం 8.1 బి.డా. బయటకు తరలిపోయాయి.
* విదేశీ వాణిజ్య రుణాలు 6.3 బి.డా. కాగా, అప్పట్లో 1.5 బి.డా. ఉపసంహరించారు.
* పర్యాటక, ఆర్థిక సేవలు, టెలికాం, కంప్యూటర్‌, ఐటీ సేవల వల్ల నికర సేవల ఆదాయం 7.3 శాతం పెరిగింది. విదేశీ మారకపు నిల్వలు 14 బి.డా. పెరగ్గా, ఏడాది క్రితం 11.3 బి.డా. తగ్గాయి.

రెండో త్రైమాసికంలో మరింత తగ్గొచ్చు: జులై-ఆగస్టు గణాంకాలను పరిశీలిస్తే, సెప్టెంబరు త్రైమాసికంలో క్యాడ్‌ 10-11 బి.డా.కు పరిమితం కావచ్చని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త ఆదితినాయర్‌ అంచనా వేశారు. 2018-19 ఇదేకాలంలో క్యాడ్‌ 19 బి.డా. కావడం గమనార్హం. ముడిచమురు ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం, పసిడికి గిరాకీ తగ్గడం ఇందుకు కారణాలని తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి క్యాడ్‌ 50 బి.డా.కు పరిమితం కావచ్చని, 2018-19 నాటి 57.2 బి.డా.తో పోలిస్తే 2.1 శాతం తగ్గొచ్చని అంచనా వేశారు.

విదేశీ రుణభారం 557.4 బి.డా.: 2019 మార్చి త్రైమాసికంతో పోలిస్తే, ఏప్రిల్‌-జూన్‌లో విదేశీ రుణభారం 14.1 బి.డా. అధికమై 557.4 బి.డా.కు చేరింది. ఇందులో వాణిజ్య రుణాల వాటా 38.4 శాతం కాగా, ప్రవాసీయుల డిపాజిట్లు 24 శాతం, స్వల్పకాల వాణిజ్య రుణం 18.7 శాతం. ఇందులో దీర్ఘకాల రుణం రూ.447.7 బి.డా.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

పసిడి భారమైనా... చమురు ఆదుకుంది! Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *