Top Ad unit 728 × 90

నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు

నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు

ఓ యువకుడు నానో కారును హెలికాప్టర్ గా మార్చేశాడు. బీహార్‌లోని సిమరీ గ్రామానికి చెందిన ఓ యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారు చేయాలనేది కలలుకన్నాడు. కానీ అంతటి ఆర్థిక స్థోమత లేకపోవడంతో నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు.

ఏడు నెలలపాటు శ్రమించి తయారు చేసిన ఈ హెలికాప్టర్ చూడటానికి నిజమైన హెలికాప్టర్‌కు ఏమాత్రం తీసిపోదు. కాకపోతే హెలికాప్టర్‌లా ఇది గాలిలో ఎగరలేదు. రోడ్డుపైనే దూసుకెళ్తుంది. తన సోదరుడితో కలిసి 7 లక్షల వ్యయంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేశాడు.

ఈ వార్త వైరల్ కావడంతో కొందరు నెటిజనులు కారును హెలికాప్టర్‌గా మార్చడం నేరమని, ఇది అతనికే కాకుండా ఇతర వాహనదారులకు కూడా ప్రమాదకరం అంటూ బీహార్ పోలీసులకు ట్వీట్ చేశారు.

గమనిక:- వీడియోల కోసం క్రింద లింక్ క్లిక్ చేసి మా YOUTUBE (pslv tv news) Channel ని SUBSCRIBE చేయండి.

https://www.youtube.com/channel/UC6bHthVLLMA1oF08776puVw?view_as=subscriber?sub_conformation=1

నానో కారును హెలికాప్టర్‌గా మార్చేశాడు Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2017 - 2019

Contact Form

Name

Email *

Message *