Top Ad unit 728 × 90

రాజస్థాన్‌లో భాజపా వ్యూహాత్మక మార్పు చేసింది

రాజస్థాన్‌లో భాజపా వ్యూహాత్మక మార్పు చేసింది...!

రాజస్థాన్‌లో భాజపా వ్యూహాత్మక మార్పు చేసింది. రాష్ట్రంలోని ప్రముఖ కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ను ఎదుర్కొనేందుకు చివరి నిమిషంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేను పక్కన పెట్టి రాజస్థాన్‌ రవాణా మంత్రి యూనస్‌ ఖాన్‌ను పోటీకి దింపింది. ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారిన టోంక్‌ నియోజకవర్గంలో ఆధిక్యం పొందేందుకు భాజపా పావులు కదుపుతోంది. టోంక్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ సచిన్‌ పైలట్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో తిరిగి చర్చలు జరిపిన భాజపా ఆ స్థానం నుంచి ఇప్పటికే టికెట్‌ ఇచ్చిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే అజిత్‌ సింగ్‌ మెహతాను పక్కనపెట్టి యూనస్‌ ఖాన్‌ను నేడు అభ్యర్థిగా ప్రకటించింది.

నవంబరు 11న విడుదల చేసిన తొలి జాబితాలో మెహతాకు టోంక్‌ను కేటాయించింది. కానీ టోంక్‌ నుంచి సచిన్‌ పైలట్‌ బరిలోకి దిగుతున్నట్లు తెలియగానే భాజపా నిర్ణయం మార్చుకుంది. టోంక్‌ నుంచి భాజపా తరఫున యూనస్‌ పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఖాన్‌ దీడ్‌వానా నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే. అయితే పార్టీ ఆయన పేరును చివరి నిమిషం వరకు రిజర్వులోనే ఉంచి ఆఖరి నిమిషంలో పైలట్‌కు పోటీగా నిలబెట్టింది. భాజపా ఈరోజు ఉదయం ఆరుగురు అభ్యర్థులతో కూడిన అయిదో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో మెహతా, శంకర్‌లాల్‌ ఖరాదిలను పక్కన పెట్టింది. గతంలో వీరికి టోంక్‌, ఖేర్‌వారా సీట్లను కేటాయించింది. కాగా తాజా జాబితాలో శంకర్‌లాల్‌కు బదులుగా ఖేర్‌వారా స్థానాన్ని నానాలా అహరికి కేటాయించింది. వీరితో పాటు ముకేశ్‌ గోయల్‌కు కోట్పుతలి, మోహిత్‌ యాదవ్‌లకు బెహ్రార్‌, ఓపీ సైనికి కరౌలి, రాజేంద్ర వినాయకకు కేక్రి, రామచంద్ర ఉత్తమ్‌కు ఖిన్వసార్‌ స్థానాల నుంచి టికెట్లు ఇచ్చింది. ఈరోజు రాజస్థాన్‌లో నామినేషన్ల సమర్పణకు చివరి తేది. సచిన్‌ పైలట్‌, యూనస్‌ ఖాన్‌లు ఇద్దరూ నేడు నామినేషన్‌ వేయనున్నారు. రాజస్థాన్‌లో డిసెంబరు 7న పోలింగ్‌ జరగనుంది.

రాజస్థాన్‌లో భాజపా వ్యూహాత్మక మార్పు చేసింది Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *