Top Ad unit 728 × 90

బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి

బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి

సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్‌ 2 విజేతగా కౌశల్‌ నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్‌ ఆధారంగా కౌశల్‌ను విజేతగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి కూడా అందుకున్నారు. కౌశల్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్నంతకాలం ఆయన అభిమానులు ‘కౌశల్‌ ఆర్మీ’ పేరిట క్షేత్రస్థాయిలో ఆయనకు మద్దతు తెలుపుతూనే వచ్చారు. కౌశల్‌ గెలవాలని ఓసారి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా నిర్వహించారు. మొత్తానికి ఆయన్ను విజేతగా నిలబెట్టారు.

బిగ్‌బాస్‌ ట్రోఫీతో కౌశల్‌ తన ఇంటికి వెళ్లే సమయానికి అప్పటికే ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘కౌశల్‌..కౌశల్‌’ అని కేకలు వేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. కౌశల్‌ తన కారుపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేశారు. తెలుగులో ఎన్నో ధారావాహికల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు కౌశల్‌. ఆ తర్వాత పలు చిత్రాల్లోనూ నటించారు. పలు రియాల్టీ డ్యాన్స్‌ ప్రోగ్రామ్స్‌లోనూ పాల్గొన్నారు. 

బిగ్‌బాస్‌ ట్రోఫీతో పాటు రూ.50 లక్షల బహుమతి Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2018

Contact Form

Name

Email *

Message *