Top Ad unit 728 × 90

ఆయుర్వేద వైద్యుడు పాటించవలసిన నియమాలు:-

ఆయుర్వేద వైద్యుడు పాటించవలసిన నియమాలు:-

ఆయుర్వేదం అనేది భగవంతుడు ఈ ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం. మిగిలిన వైద్యపద్ధతులవలే ప్రత్యేకమైన చదువు దీనికి అవసరం లేదు. ఆయుర్వేదంలో అనుభవం అనేది ప్రధానం. రోగి ఏ వ్యాధితో భాధపడుతున్నాడో సరిగ్గా అంచనావేసి దానికి సరైన చికిత్సను అందించడంలోనే వైద్యుడి యొక్క గొప్పతనం అనేది ఉంటుంది.

ఈ మధ్యకాలంలో నేను కొన్ని వీడియోస్ చూసాను, దానిలో ఇది వాడుకోండి అత్యద్భుతంగా పనిచేస్తుంది, ఇలా వాడండి అలా చేస్తే తిరుగే ఉండదు వంటి మాటలతో జనాన్ని పిచ్చివాళ్లని చేస్తున్నారు. అసలు మనిషి శరీరతత్వం తెలియకుండా మందు ఎలా చెప్తారు అన్నదే అర్ధంకాని ప్రశ్న...?

ప్రతిమనిషిలోను ఆయుర్వేదం ప్రకారం మూడు తత్వాలు ఉంటాయి. అవి వాత, పిత్త, కఫాలు. తల భాగం నుంచి ఉదర పైబాగం వరకు కఫ శరీరం ఉంటుంది. ఉదర భాగం నుంచి నడుము పై భాగం వరకు పిత్త శరీరం ఉంటుంది. నడుము భాగం నుంచి పాదాల వరకు వాత శరీరం ఉంటుంది. మనం తీసుకునే ఆహారాల వల్లకాని లేక మనం సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్లకాని వాత, పిత్త, కఫాల మద్య అసమతులనం ఏర్పడి రకరకాల రోగాలు సంప్రాప్తిస్తాయి. ఈ మూడు తత్వాలు సమానంగా ఉన్నంతవరకు మనకి ఎటువంటి సమస్యలు ఉండవు.

ఒక వ్యక్తిని చూడగానే అతని శరీరతత్వాన్ని ముందుగా అంచనావేసే అనుభవాన్ని వైద్యుడు పొందగలగాలి. రోగికి సమీపమున కూర్చొని ముందుగా కొన్నిరకాల ప్రశ్నలు అడగవలెను. దానివలన మరికొంత అవగాహన కలుగును. అవి...

రోగనిర్థారణ ప్రశ్నలు -

* రోగి వయస్సు మరియు రోగి కలుగు వేదన గురించి అడుగవలెను.

* మలమూత్రములు క్రమముగా వెళ్లుచున్నావా ? మలమూత్రాల రంగు గురించి అడగవలెను.

* రోగిని అడుగుచూ రోగి యొక్క శరీర ప్రకృతి వాతమా, పిత్తమా, లేక కఫామా, అన్నది నిర్ధారణకు రావలెను .

* భుజించు పదార్ధాలలో ఏయే పదార్థాలు ఎక్కువుగా తింటారు...?

* నిద్ర సక్రమముగా పట్టునా...?

* సుఖవ్యాధులు ఏమైనా ఉన్నావా...? వాటి లక్షణాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి...?

* జ్వరం వచ్చుచున్నదా ? ఏయే సమయాలలో వచ్చును ?.

* ఎప్పుడు అయినా కర్పూర సంబంధమైన రసాలు ( menthol ) సేవించారా ?

* మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నాయా ?

* రోగి యొక్క రక్తసంబంధీకులలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నదా ?

* చల్లటి పదార్థాలు తీసుకున్నపుడు ఎలా ఉంటుంది ? వేడిపదార్థాలు తీసుకున్నపుడు ఎలా ఉంటుంది ?

* రోగి స్థూల శరీరుడా ? శుష్క శరీరుడా ?

* రోగి కూర్చొని పనిచేయువాడా లేక తిరుగుతూ పనిచేయువాడా అనగా మన ఉద్యోగం వల్ల కూడా మనకొచ్చే జబ్బులు ఉంటాయి.

* ఇదివరలో ఎమైనా మందులు సేవించారా ? ఇప్పుడు ఎమైనా మందులు వాడుతున్నారా ?

* స్త్రీ అయినచో సంతానవతియా ? కాదా ? గర్భిణీ స్త్రీ అయిన ఎన్నో మాసము ? ఋతువు సరిగ్గా వచ్చుచున్నదా ? ప్రసూతి అయ్యినప్పుడు మలినములు అన్నియు బయటకి వెడలినవా ? ఎంతకాలం అయినది ? దేహదారుఢ్యం ఎలా ఉంది ?.

* చంటిపిల్లలు అయినా పాలు సరిగ్గా తాగుదురా?

* చంటిపిల్లకు కలిగే బాలపాప చిన్నె అనే వాత సంబంధ రోగం ఉన్నదా ?.

* కడుపునొప్పి , కడుపు వెంట జిగురు వెళ్లుట, పాలు కక్కుట ఉందా ?

ఇన్ని రకాల ప్రశ్నలు వేసి నాడిని పట్టుకొని చూసి రోగాన్ని సరిగ్గా అంచనా వేసుకొని ఆ తరువాత రోగి యొక్క శరీర తత్వాన్ని దృష్టిలో పెట్టుకొని ఔషధాన్ని ఇవ్వవలెను.

మనిషికి 120 సంవత్సరములు ఆయుర్దాయం అని జ్యోతిష్యగ్రంధాలు తెలుపుచున్నాయి. కాని ప్రస్తుతం మనం తినే ఈ పురుగు మందుల తిండికి 60 సంవత్సరాలు బ్రతకడమే గొప్ప అవుతున్నది. కేవలం నాడీ జ్ఞానం వల్లనే రోగం తెలుసుకొనుట కష్టం అని మనపూర్వీకులు అష్టమస్థాన పరీక్ష గురించి తమగ్రంధాలలో విపులంగా రాశారు.

అష్టమస్థాన పరీక్ష అనగా...!

1 - నాడీ , 2 - స్పర్శ , 3 - రూపము , 4 - శబ్దము , 5 - నేత్రము , 6 - మూత్రము , 7 - పురీషము , 8 - నాలుక .

పైన చెప్పిన ఎనిమిదింటిని పరిశీలించి రోగ నిర్ధారణ చేయవలెను.

ఇన్నిరకాల పరీక్షలు చేసి రోగనిర్దారణ చేయవలెను. వైద్యుడు రొగికి ఇచ్చే ఔషదం శుద్ది చేసి మాత్రమే ఇవ్వవలెను. శుద్ధి చేయనటువంటి ఔషధం పనిచేయదు.

చివరగా ఒక్కమాట మీకు తెలియచేయదలుచుకున్నాను అవగాహన లేనివారి మాటలు విని సొంతంగా ప్రయోగాలు చేసుకుని ఏదన్నా సమస్య వస్తే దయచేసి ఆయుర్వేదాన్ని నిందించకండి. తప్పు ఆయుర్వేదానిది కాదు. మీకు చెప్తున్న అవగాహన లేని వ్యక్తులది. మీ అంతట మీరు వైద్యం చేసుకోవాలి అనుకుంటే ముందు మీ శరీరతత్వాన్ని తెలుసుకోండి. అదే విధంగా మీరు సంప్రదించే వ్యక్తి ఆయుర్వేదం మీద సంపూర్ణ అవగాహన కలిగినవాడా లేదా అన్నది కూడా ఒకటికి పదిసార్లు అడిగి మీకు సంతృప్తికరమైన జవాబులు వస్తేనే సంప్రదించండి .

ఇవన్నీ మీకు చెప్పుటకు ప్రధాన కారణం ఒక వ్యక్తి చెప్పిన మందులు వాడి ఫలితం కానరాక ఆయుర్వేదం సరిగ్గా పనిచేయదు. వేడి చేస్తుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వంటి మాటలు నాతో మాట్లాడారు. అందుకే ఆయుర్వేద గొప్పతనాన్ని వివరించవల్సి వచ్చింది.

గమనిక: -

నేను రాసిన "ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు " అనేక అమూల్యమయిన వైద్యపరమైన ఆయుర్వేద మూలికల ఉపయోగాలు ఇవ్వడం జరిగింది. ప్రాచీన ఆయుర్వేదానికి సంభందించిన అనేక రహస్య యోగాలు, మా వంశపారంపర్య అనుభవ యోగాలు, మన చుట్టుపక్కల దొరికే మూలికలు మరియు ఇంట్లో ఉన్నటువంటి వంట దినుసులతోనే పెద్దపెద్ద సమస్యలను నయం చేసుకునేవిధంగా అత్యంత సులభ యోగాలు మొక్కల యొక్క రంగుల చిత్రాలతో పాటు వాటి ఉపయోగాలు, చెట్లను బట్టి భూమిలో నీటిజాడను తెలుసుకొనుట, వృక్షాయుర్వేదం, పశువులకు సంబంధించిన అనేక యోగాలు మొదలైన అమూల్యమయిన విషయాలు ఇవ్వడం జరిగింది.

ఈ గ్రంథం యొక్క విలువ 350 రూపాయలు కావలసిన వారు ఫొన్ నందు సంప్రదించగలరు. ఫోన్ నంబర్ 9885030034 .


కాళహస్తి వెంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేదం

9885030034

ఈ గ్రంథం కావలిసినవారు డైరెక్టుగా పైన తెలిపిన నెంబర్ కి ఫోన్ చేయగలరు.

ఆయుర్వేద వైద్యుడు పాటించవలసిన నియమాలు:- Reviewed by admin on Sunday, September 07, 2014 Rating: 5
All Rights Reserved by VGC Online Services Pvt. Ltd. © 2014 - 2019

Contact Form

Name

Email *

Message *